విజయ్​ ‘లియో’లో రాంచరణ్​!

విజయ్​ ‘లియో’లో రాంచరణ్​!

ఇళయ దళపతి విజయ్(Thalapathy Vijay) ​తో సెన్సేషనల్​ దర్శకుడు లోకేష్​ కనకరాజ్ (Lokesh Kanagaraj) ​ ‘లియో’ (Leo)  సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. త్రిష(Trisha) హీరోయిన్​గా నటిస్తోంది. తన యూనివర్స్​లో భాగంగా లోకేశ్​ దీనిని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఎక్కడ లేని హైప్​ క్రియేట్​ అయ్యింది. 

ఓ లేటెస్ట్​ బజ్​ ఇప్పుడు మెగా ఫ్యాన్స్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్​లో రాంచరణ్​ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హీరో విజయ్​..  చరణ్​, లోకేశ్​ డిన్నర్​కి ఇన్వైట్​ చేసినట్టుగా సమాచారం. దీంతో లియోలో చెర్రీ కీ రోల్​  చేస్తున్నాడనే టాక్​ ఊపందుకుంది. 

ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మూవీ టీం స్పందించాల్సిందే.