
మహేశ్ బాబు సోదరుడు, ప్రముఖ నటుడు రమేశ్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. శనివారం రాత్రి రమేశ్ బాబు మృతిచెందారు. ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో రమేశ్ బాబు భౌతిక కాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో చివరి చూపు కోసం అభిమానులు, కుటుంబ సభ్యులు వచ్చారు. రమేశ్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కొడుకు పార్థీవ దేహం ఎదుట ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు మహేశ్ బాబుకు కరోనా సోకడంతో అన్న రమేష్ అంత్యక్రియలకు రాలేకపోయారు. ప్రస్తుతం మహేశ్ దుబాయ్ లో ఉండటంతో అక్కడే ఐసోలేషన్ లోఉన్నారు.
ఘట్టమనేని రమేశ్‌బాబు మృతితో టాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన.. వ్యక్తిగత విషయాలు చూసుకుంటున్నారు. అనారోగ్యం కూడా ఉండటంతో ఈయన బయటికి కూడా పెద్దగా రావడం లేదు. పరిస్థితి విషమించడంతో జనవరి 8న ఈయన కన్నుమూశారు. ఈయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి:
కరోనాపై మోడీ సమీక్ష.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
హైదరాబాద్‌లో ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి