ఎంత గట్టిగా నన్నుఆపిితే అంత గట్టిగా పైకి లేస్తా

ఎంత గట్టిగా నన్నుఆపిితే అంత గట్టిగా పైకి లేస్తా

రామ్ గోపాల్ వర్మ నుండి వస్తోన్న చిత్రం‘అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు’. నవంబర్ 29న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ కారణాలతో వాయిదా పడింది. ఆ వివరాలను వెల్లడించేందుకు రామ్ గోపాల్ వర్మ, నట్టికుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వర్మ మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన పరిణామాల్లో నాకు ఆసక్తిగా అనిపించిన అంశాల ఆధారంగా ఈ సినిమా చేశాను. ఏ కులాన్ని, వర్గాన్ని తక్కువ చేసి చూపలేదు. కానీ మాకు వచ్చిన కొన్ని అభ్యర్థనలు, సూచనల్ని గౌరవించి టైటిల్ మార్చాం . ఇదో సందేశాత్మక చిత్రం. ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోవద్దనేది ఇందులో సందేశం.

యూట్యూబ్ లాంటి మాధ్యమాల్లో పొలిటీషియన్స్‌‌కి సంబంధించిన చాలా వీడియోలను ట్రోల్ చేస్తుంటారు.ఈ సినిమా ఆ ట్రోల్స్‌‌కి ఎక్స్‌‌టెన్షన్‌‌. ట్రైలర్నచ్చి సినిమా చూడాలనుకుంటే రిలీజ్ ఆలస్యమైనా ప్రేక్షకులు చూస్తారనే నమ్మకముంది. వెబ్‌‌లో విడుదల చేయదలచుకోలేదు… థియేటర్స్‌‌లోనే రిలీజ్ చేస్తాం. ఇక ఒకరిని ప్రేమించడానికి, మరొకరిని ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. కానీ ఎంత గట్టిగా నన్ను ఆపితే అంత గట్టిగా పైకిలేస్తాను . అందుకే ఈ మూవీకి సీక్వె ల్ కూడా ప్లాన్ చేస్తున్నాను’ అన్నారు.

నట్టికు మార్ మాట్లాడుతూ ‘టెక్నికల్ కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈనెల 14న సెన్సార్‌‌‌‌ని అప్లై చేశాం . 29న విడుదల చేయాలనే ఉద్దేశంతోఅర్జెన్సీ సర్టిఫికెట్ కూడా పొందుపరచాం . కానీ మా సినిమాని ఇంత వరకూ చూడలేదు. అందుకు కారణాలు వెల్లడించలేదు. అందుకే మేము కోర్టును ఆశ్రయించాం . గురువారం నుండి ఏడు రోజులలోపు సెన్సార్ వారు సినిమాని చూసి రిపోర్ట్‌‌ ఇవ్వాలని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాక త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం ’ అన్నారు.  నిర్మాత అజయ్ మైసూర్ మాట్లాడుతూ ‘ఇదో పొలిటికల్ సెటైర్ మూవీ తప్ప ఎవరినీ కించపరచేలా తీయలేదు.మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది’
అన్నారు.