చివరి జుమ్మా ప్రశాంతం

చివరి జుమ్మా ప్రశాంతం

హైదరాబాద్ : రంజాన్ ఉపవాస దీక్షల చివరి శుక్రవారం సందర్భంగా సిటీలోని పలు మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి మక్కా మసీదుకు చేరుకున్నారు. దీంతో చార్మినార్​ నాలుగు వైపులా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మక్కా మసీదు వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.