
హైదరాబాద్: టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా తన మంచి మనుసును చాటుకున్నాడు. కరోనా టైమ్‌లో ఆదివాసీలకు అండగా నిలిచి నిజమైన హీరో అనిపించుకున్నాడు. నిర్మల్ జిల్లాలోని దాదాపు 400 ఆదివాసీ కుటుంబాలకు కావాల్సిన నిత్యావసరాలు, అవసరమైన సామాగ్రిని రానా అందించడం విశేషం. నిర్మల్ జిల్లాలోని అల్లంపల్లి, బాబా నాయక్ రన్‌దా గ్రామ పంచాయతీల్లోని గుర్రం మధిర, పాలరేగడి, అడ్డాల తిమ్మాపూర్, చింతగూడెం, గొంగురం గూడతోపాటు కడెం మండలానికి సాయం అందించాడు. ఆయా గ్రామాలు, గూడెంల్లోని ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలతోపాటు మెడిసిన్స్, గ్రాసరీస్‌ను అందించాడు. ఇక, సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విరాట పర్వం మూవీతోపాటు పవన్ కల్యాణ్‌తో కలసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పనుల్లో రానా బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మిలింద్ రావు దర్శకత్వంలో భారీ వీఎఫ్‌ఎక్స్ దృశ్యాలతో కూడిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీకి ఓకే చెప్పాడు.