రానా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసిన మిహికా

రానా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసిన మిహికా

తాను ప్రేమలో పడిన విషయాన్ని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కన్ఫామ్ చేశాడు.  తన ప్రపోజల్ కు మిహికా బజాజ్ అనే అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ట్వీట్ చేశాడు. అంతేకాదు వాళ్లిద్దరు దిగిన సెల్ఫీను షేర్ చేశాడు.

బల్లాల దేవ ప్రేమించిన అమ్మాయి ఎవరంటే

బల్లాల దేవ రానా ప్రేమించిన అమ్మాయి మిహికా వెడ్డింగ్ ప్లానర్. లండన్‌లోని చెల్సీ యూనివర్సీటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌లో ఏంఏ పూర్తి చేసింది. ప్రస్తుతం మిహికా డ్యూ డ్రాప్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి ఆమెతో రానా  ప్రేమ ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిసింది.