
వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. పాపులర్ అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’కు ఇది ఇండియన్ అడాప్టేషన్. ఈ నెల 10 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న సందర్భంగా రానా మాట్లాడుతూ ‘నేను సాధారణంగా కంప్లీట్ గుడ్, లేదంటే కంప్లీట్ బ్యాడ్ క్యారెక్టర్ చేశాను. కానీ ఈ సిరీస్‌లో రెండూ కలిసి ఉంటాయి. రానా పేరు తప్పితే.. ఈ పాత్రకు నాకు ఏమీ పోలికలు ఉండవు. ఇందులో రానా డార్క్ లైఫ్ గడుపుతుంటాడు. తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడతాడు. ఓ ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంటుంది. కోపాన్ని ఎక్కువ చూపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే బయట నేనెప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. మా బాబాయ్‌కి, నాకు ఆఫ్ స్క్రీన్ కూడా మంచి బాండింగ్ ఉంది. ఇద్దరం పోటాపోటీ పాత్రలు పోషించినప్పటికీ కేవలం రానా, నాగా క్యారెక్టర్స్ మధ్య ఉండే అగ్రెసివ్ నెస్, ఎమోషన్స్‌పైనే ఫోకస్ పెట్టాం. స్టోరీ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ కొత్తగా అనిపిస్తాయి’ అని చెప్పాడు.