కుర్ర హీరో సమోసా లొల్లి.. అందరూ చూడాలంటున్న రానా

కుర్ర హీరో సమోసా లొల్లి.. అందరూ చూడాలంటున్న రానా

న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు హీరో రానా దగ్గుబాటి. తాజాగా మరో హీరోకి రానా మద్దతుగా నిలిచాడు. ‘మసూద’ సినిమాతో హిట్టందుకున్న తిరువీర్ ‘పరేషాన్’  సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించి విడుదలైన టీజర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. తాజాగా పరేషాన్ సినిమా సమర్పణ బాధ్యతలను తాను తీసుకుంటున్నట్టుగా రానా ప్రకటించాడు. ఈ మేరకు ’సమోసా తిన్నారా?‘ అంటూ ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

 ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఓ వీడియోను షేర్ చేశాడు. తెలంగాణ యాసలో నటీనటుల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.  రానా ఈ సినిమాలో భాగం కావడంతో దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఒక్క సమోసా కోసం నలుగురు కొట్టుకోవడంతో ఈ ఫన్నీ వీడియో మొదలవుతుంది. తిరువీర్ కు జోడీగా పావనీ కరణం ఫిమేల్ లీడ్ గా  కనిపిస్తోంది. బలగం, డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు పొందిన మురళీధర్ గౌడ్ హీరో తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వంలో వస్తోన్న  ఈ సినిమాని వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. 

https://twitter.com/RanaDaggubati/status/1643503696914042880