
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు(Rana Naidu). తండ్రీ కొడుకుల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. వెంకీ రానాల మధ్య వచ్చే సీన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. రానా డైనమిక్ డైలాగ్స్కి బాడీ లాంగ్వేజ్కి నెటిజన్స్ సైతం స్పెషల్ కామెంట్స్ చేశారు.
తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటనకు గాను ఉత్తమ నటుడిగా దగ్గుబాటి రానా అవార్డు పొందాడు. ”ఇండియన్ టెలి అవార్డు 2024 “లో భాగంగా రానా ఈ అవార్డును అందుకున్నాడు. ఈ ఈవెంట్ లో రానా అటెండ్ కాకపోవడంతో ఆయనకు బదులు రానా నాయుడు సీరియస్ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ అవార్డు అందుకోవడంతో రానా స్పందించారు. ఈ విషయంపై రానా మాట్లాడుతూ..తాను ఈ పబ్లిక్ ఛాయిస్ అవార్డుకి ఎంపిక కావడం చాలా గౌరవంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో ప్రస్తుతం రానా కు పెద్ద ఎత్తున విషెష్ చెబుతున్నారు ఫ్యాన్స్.
Thank you for the honour ?? https://t.co/Rfw6yX1Iz1
— Rana Daggubati (@RanaDaggubati) July 19, 2024
ఈ రానా నాయుడు సిరీస్ విషయానికి వస్తే..అమెరికన్ టీవీ సిరీస్ ”రే డోనోవస్” కు రీ మేకింగ్ గా తెరకెక్కించారు. క్రైమ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో రియల్ లైఫ్ బాబాయ్, కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో వెంకటేష్ పై మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. కారణం ఈ సిరీస్ లో వెంకటేష్ బోల్డ్ సీన్స్ అండ్ డైలాగ్స్ చెప్పడం. నిజానికి వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి..అందుకు బిన్నంగా అలా బోల్డ్ సిరీస్ లో కనిపించడం ఆయన ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. అయితే మన ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోయినా..వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను మాత్రం సూపర్ గా ఆకట్టుకుంది.
Huge congratulations to @RanaDaggubati for clinching the Public Choice - Best Actor - Series award for Rana Naidu streamed on @netflix at The #ITSA2024 @tellychakkar
— Indiantelevision.com (@ITVNewz) July 19, 2024
Celebration Partner: @100PipersIN
Gifting Partner: @HappiloIndia @SmoorChocolates#ITSA2024 pic.twitter.com/4jFHSGFgWo