‘రణస్థలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

‘రణస్థలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరశురాం శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘రణస్థలి’. సురెడ్డి విష్ణు సమర్పణలో అనుపమ నిర్మించారు. శుక్రవారం అన్నపూర్ణ సంస్థ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అశ్వనీదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ ‘మాకు గురు సమానులైన విజయ పిక్చర్స్ వెంకటరత్నం గారి అబ్బాయి విష్ణు.. సినిమా రంగంలోకి రావడం సంతోషంగా ఉంది. తను నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొన్ని సీన్స్ చూస్తుంటే ‘ఇంద్ర’ సినిమా గుర్తొస్తోంది. సినిమా విజయం సాధించాలని కోరుతున్నా’ అన్నారు. వీడియో బైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విష్ చేశారు పూరి జగన్నాథ్. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరోహీరోయిన్స్. ‘పూరి జగన్నాథ్ స్ఫూర్తితో డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమా తీశా’ అన్నాడు దర్శకుడు. ‘అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది’ అన్నారు నిర్మాతలు.