అలియా భట్, రణబీర్ కపూర్‌లకు ఆయోధ్య ఆహ్వానం

అలియా భట్, రణబీర్ కపూర్‌లకు ఆయోధ్య ఆహ్వానం

ఉత్తరప్రదేశ్‌లోని  రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బాలీవుడ్ నటీనటుల జంట అలియా భట్, రణబీర్ కపూర్‌లకు అధికారికంగా ఆహ్వానం అందింది.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆహ్వానించింది. జనవరి 22న జరగబోయే ఈ  కార్యక్రమంలో అలియా, రణబీర్ భాగం అవుతారని నిర్మాత మహావీర్ జైన్ తెలిపారు.  కాగా ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్ లాంటి సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. 

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 2024  జనవరి 22న అయోధ్యలో జరగనుంది, ప్రధాని మోదీ దీనికి చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు.  సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామ మందిరం సముదాయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు ఉంటుంది.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్ష మంది భక్తులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.  

అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశమంతటా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పట్టణాలు, పల్లెల్లో బూత్ లెవెల్​లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేడుకలను లైవ్​లో ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. వేడుకలు జరిగే రోజున అయోధ్యకు అందరూ వచ్చే అవకాశంలేనందున ప్రతి సామాన్యుడు ఉన్న చోటి నుంచే వేడుకలను వీక్షిస్తూ, బాల రాముడిని దర్శించుకునేలా చూడాలని పార్టీ భావిస్తోంది.