లిప్ లాక్స్తో రెచ్చిపోయిన రణ్బీర్, రష్మిక.. యానిమల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

లిప్ లాక్స్తో రెచ్చిపోయిన రణ్బీర్, రష్మిక.. యానిమల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

అర్జున్ రెడ్డి(Arjun reddy) దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యానిమల్(Animal). బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir kapoor), నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) జంటగా నటిస్తున్న ఈ మోస్ట్ వైలెంట్ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న  ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్ ఆ అంచనాలను అమాంతం పేచేశాయి. 

Also Read :- కంటతడి పెట్టిన రైతు బిడ్డ

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అమ్మాయి అంటూ సాగిన ఈ మెలోడియస్‌ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాటలో విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక పాటలో రణ్బీర్, రష్మిక ల రొమాన్స్ పీక్స్ లో ఉంది. లిప్ లాక్స్ రెచ్చిపోయారు ఈ జంట.  ఇవన్నీ చూస్తుంటే మరోసారి అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ రిపీట్ కానుంది అనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనున్నారు అనేది చూడాలి.