దీన్ని కూడా అభిమానమంటారా భయ్యా.. సెల్ఫీ కోసం ఇలా వేధించడం కరెక్టేనా

దీన్ని కూడా అభిమానమంటారా భయ్యా.. సెల్ఫీ కోసం ఇలా వేధించడం కరెక్టేనా

కొందరు తమ ఫెవరేట్ హీరో లేదా హీరోయిన్ కోసం మంచి పనులు చేసి తమ అభిమానాన్ని నిరూపించుకుంటే.. మరికొందరు మాత్రం.. వారికి ఇబ్బందిని కలిగిస్తూ, తలనొప్పిగా మారుతూ ఉంటారు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే.. వారు దీన్ని కూడా అభిమానమే అంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మనకు నచ్చిన వారికి ఇబ్బంది కలిగిస్తే అది అభిమానం అంటారా.. తాజాగా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్  సింగ్.

ఫొటోగ్రాఫర్ వరీందర్ చావ్లా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో నీలిరంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి... తన పక్కన రణ్ బీర్ ఉన్న కారు కిటికీలోంచి రణబీర్ ఫోటోను బలవంతంగా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రణ్‌బీర్ డ్రైవర్ కిటికీ పేన్‌ని దించి, బాలుడిని ముందుకు వెళ్లమని కోరడం కూడా ఇందులో చూడవచ్చు. ఆ తర్వాత కూడా బైకర్.. రణబీర్ ను ఫొటోలను క్లిక్ చేయడం చూడవచ్చు.

వైరల్‌గా మారిన ఈ వీడియో సరిగా లేకపోవడంతో నెటిజన్లు, అభిమానులు ‘ఇది అక్షరాలా వేధింపు’ అని వ్యాఖ్యానించారు. "తెలివి లేని అభిమాని. అందుకే బాడీగార్డులు ఈ కుర్రాళ్లను కొట్టారు" అని మరొకరు అన్నారు. "కొంతమందికి ప్రైవసీ అంటే అర్థం నిజంగా తెలియదు" అని ఇంకొందరు విమర్శించారు.

రణబీర్ ప్రస్తుతం రష్మిక బందన్నాతో కలిసి 'యానిమల్' లో నటిస్తుండగా.. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా ఐదు భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ ల టీ-సిరీస్, మురాద్ ఖేతాని సినీ 1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి.