- ఆర్‌అండ్‌బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్
తాడ్వాయి, వెలుగు : మేడారం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్‌నాయక్ సూచించారు. మేడారంలో జరుగుతున్న పనులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉదయం మేడారం చేరుకున్న ఆయన ఇంజినీరింగ్ ఆఫీసర్లతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆఫీసర్ల, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. గద్దెల ఆవరణలో జరుగుతున్న పనుల్లో క్వాలిటీ పాటించాలని ఆదేశించారు.
ఈ నెల 7 నుంచి పదో తేదీ లోపు పిల్లర్స్‌తో పాటు గ్రానైట్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 13, 14 తేదీల్లో మంత్రులు వచ్చే అవకాశం ఉందని, సీఎం ప్రత్యేక కార్యదర్శి సైతం అభివృద్ధి పనులను పరిశీలించి సీఎంకు నివేదిక సమర్పించే అవకాశం ఉన్నందున ఆపీసర్లు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ ఆఫీసర్లు ఉన్నారు.
