రివ్యూ: రంగ్ దే!

V6 Velugu Posted on Mar 26, 2021

నటీనటులు : నితిన్, కీర్తి సురేష్, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత‌లు : సూర్యదేవర నాగ వంశీ
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : పి. సి. శ్రీరామ్
ఎడిటింగ్ : నవీన్ నూలి
రిలీజ్ తేదీ :మార్చి 26, 2021

కథ :
అర్జున్(నితిన్) , అను(కీర్తీ సురేష్) చిన్నప్పటి నుండి పక్క పక్క ఇళ్లల్లో ఉండటంతో ..ఒకరి ఫ్యామిలీతో మరొకరికి మంచి బాండింగ్ ఉంటుంది.ఇక అర్జున్ తండ్రి నరేష్.. ప్రతి విషయానికి అనును చేసి నేర్చొకో అని చెప్పటంతో..అను మీద అర్జున్ కు అయిష్టత ఏర్పడుతుంది.అనుకు మాత్రం అర్జున్ అంటే ఇష్టం ఉంటుంది.అయితే కొన్ని పరిస్థితులలో అనును ,అర్జున్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.మరి ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న హీరో..హీరోయిన్ తో కాపురం చేసాడా ? తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ

నటీనటుల పర్ఫార్మెన్స్:

నితిన్ 24 ఏళ్ళ కుర్రాడిగా మెప్పించాడు.తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.కీర్తి సురేష్ మరోసారి మంచి నటన ప్రదర్శించింది.ఎమోషనల్ సీన్స్ లో మరింత ప్రతిభ చూపించింది.నితిన్,కీర్తి ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర మెరకు నటించారు.వెన్నెల కిషోర్ కామెడీ పండించే ప్రయత్నం చేసాడు.

టెక్నికల్ వర్క్:

 పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పర్వాలేదు.రెండు పాటలు మాత్రం బాగానే ఆకట్టుకుంటాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా మెప్పించింది.ఎడిటర్ కూడా పనితనం చూపించాడు.

విశ్లేషణ:

ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన ఇలాంటి కథను కొత్తగా చెప్పాల్సి ఉంటుంది.దర్శకుడు వెంకీ అట్లూరి..మొదటి బాగంలో ఎంటర్టైన్ చేసిన..రెండవ పార్ట్ లో మాత్రం అంతగా అట్రాక్ట్ చేయలేకపోయాడు.దాంతో సినిమా యావరేజ్ గా మిగిలింది.నితిన్,కీర్తిల జోడి మెప్పిస్తుంది.అక్కడక్కడ కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి.మొత్తానికి ...థియేటర్ల నుండి బయటకి వచ్చిన ప్రేక్షకుడికి ఓకే అనిపిస్తుంది.

బాటమ్ లైన్: మెరిసింది కొన్ని రంగులే

Tagged nithin

Latest Videos

Subscribe Now

More News