ప్రజలు చేసే పాపాల వల్ల వర్షాలు పడ్తలేవు.. పాపం చేసినా..పుణ్యం చేసినా మీకే

ప్రజలు చేసే పాపాల వల్ల వర్షాలు పడ్తలేవు.. పాపం చేసినా..పుణ్యం చేసినా మీకే

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జులై 17వ తేదీ సోమవారం  లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం దగ్గర రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా  అనురాధ పచ్చికుండ పై నిలబడి భవిష్యవాణి వినిపించారు. 

భవిష్యవాణి..ఏం చెప్పారంటే..

భక్తుల పూజలపై సింహవాహిని మహంకాళి అమ్మవారు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల పూజలను ఆనందంతో అందుకున్నట్లు తెలిపారు.  భక్తులకు ఎవరికి ఏమీ కాకుండా చూసుకుంటానని అమ్మవారి అభయం ఇచ్చారు. అయితే వర్షాలు ఆలస్యానికి భక్తులు చేసే పాపాలే కారణమని చెప్పారు. ప్రజలు చేసే పాపాల వల్లే ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్నాయన్నారు అమ్మవారు. ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని అమ్మవారు సూచించారు. ఏం జరగకుండా తాను చూసుకుంటానని సెలవిచ్చారు. 

భక్తులు ఎక్కడి నుంచి కోరికలు కోరుకుని మొక్కులు చెల్లించుకున్నా..వారి కోరికలను నెరవేరుస్తానని అమ్మవారు తెలిపారు. పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి..కల్లుతో సాకపెడితే భక్తులను అడుగడుగునా కాపాడుకుంటానన్నారు. శాంతి పూజలు చేసిన తర్వాత ఆడపడుచులకు అన్ని విధాలా మంచి చేస్తానని అమ్మవారి అభయం ఇచ్చారు. ఎవరి మనసులో ఏమున్నా... తన దగ్గరికి వచ్చి పూజలు నిర్వహించి కోరికలు కోరుకుంటే వారి బాధలు తీరుస్తానన్నారు. ఎంత పుణ్యం,పాపం చేసినా భక్తులకే సొంతమని...మంచికాలంలో మంచిగా నడుచుకున్నపుడు మంచే జరుగుతుందన్నారు.