
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్‌లోని శ్రీగోదా సమేత మన్నార్ రంగనాయకస్వామి రథోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యకుడు తోటకూర వజ్రేశ్‌యాదవ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, హరివర్తన్రెడ్డి రథాన్ని ముందుకు లాగి ప్రారంభించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.