హైదరాబాద్ కంటే.. రంగారెడ్డి వాళ్లే ధనవంతులు

హైదరాబాద్ కంటే.. రంగారెడ్డి వాళ్లే ధనవంతులు

హైదరాబాద్ నగరం... తెలంగాణ రాష్ట్రానికి  రాజధానియే కాదు.. అత్యధిక ఆదానిచ్చే జిల్లా కూడా. ఈ విషయం ఎవరినీ అడిగినా టక్కున చెబుతారు.  ప్రైవేట్ కంపనీలతోపాటు వివధ వ్యాపార సంస్థలు ఉండడంతో హైదరాబాద్ వాసులు అన్ని జిల్లాల వారి కంటే ఎక్కువగా.. లక్షల్లో సంపాదిస్తుంటారు. ఖర్చు కూడా అదే మాదిరి ఉంటుంది. కాబట్టీ, తెలంగాణలో రిచెస్ట్ జిల్లాగా హైదరాబాద్ కొనసాగుతుంది. కానీ, ఇప్పుడు లెక్క మారింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది రంగారెడ్డి జిల్లా. అవును..  ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నది రంగారెడ్డి  జిల్లా వారే. పర్ క్యాపిట ఇన్ కమ్ ఆదారంగా.. తెలంగాణలో రిచెస్ట్ జిల్లాగా రంగారెడ్డి తొలి స్థానంలో చేరుకోగా.. హైదరాబాద్ సెకండ్ ప్లేస్ కు పడిపోయింది.

తాజాగా రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్ మెంట్... తెలంగాణ ఎకానమి 2023 పేరుతో నివేదికను విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిట ఇన్ కమ్ రూ.8.15లక్షలకు పైగా ఉండగా.. హైదరాబాద్  పర్ క్యాపిట ఇన్ కమ్ కేవలం రూ.4.03లక్షలకు పైగా ఉంది.  దీంతో హైదరాబాద్ వాసుల కంటే రంగారెడ్డి జిల్లా వాసులే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్లు తేలింది.  ఐటీ హబ్ కారణంగానే రంగారెడ్డి రిచెస్ట్ జిల్లాగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీలు.. తమ కార్యాలయాల కోసం రంగారెడ్డి జిల్లానే ఎంచుకుంటున్నాయి. జోన్ల వారీగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని ఐటీ హబ్‌లు రంగారెడ్డి జిల్లా వైపు తరలిపోతున్నాయి. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జిడిడిపి) పరంగా కూడా..  తెలంగాణలోని జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది.