అమ్మో చిరుత పులి!

అమ్మో చిరుత పులి!
  • ఆరు నెలల్లో 20 చోట్ల దాడులు
  • పొలాలు, బావుల వద్దకు వెళ్లాలంటే జంకుతున్న జనం
  • చంపేది చిరుతనేనని నిర్ధారించిన అధికారులు
  • ఆరో చోట్ల బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కడ్తాల్, కందుకూరు, మాడ్గుల మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. ఇప్పటి వరకు 20 చోట్ల పశువులు, మేకలు, గొర్రెల మందలపై దాడులకు పాల్పడింది. యాచారం మండలంలోని కొత్తపల్లి, కొత్తపల్లి తండా, మేడిపల్లి, నందివనపర్తి ,తాటిపర్తి, కుర్మిద్ద, కుర్మిద్ద తండా, కందుకూరు మండలంలోని సాయిరెడ్డిగూడ, మాడ్గుల మండలంలోని సరికొండ, కడ్తాల మండలంలోని గోవిందాయపల్లి గ్రామాల పరిసరాల్లో రాత్రి సమయంలో మూగ జీవాలపై దాడిచేసి చంపి తింటోంది. కడ్తాల మండలంలోని గోవిందాయపల్లిలో చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమరాల్లో ఆ దృశ్యాలు నమోదైనట్లు అటవీ అధికారులు నిర్ధారించారు.

ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఉదయం, రాత్రి సమయాల్లో ఒంటరిగా వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఆరు నెలల్లో చిరుత 20 చోట్ల దాడులకు పాల్పడటంతో రైతులు, పశువుల కాపర్లు బావుల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. యాచారం మండలంలోని కొత్తపల్లి, తాటిపర్తి, మాడ్గుల మండలం సరికొండ, కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ సమీపంలో గుట్టలు, కొండలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అడవి జంతువులు, క్రూరమృగాలు ఉండే అవకాశముంది. రెండు సంవత్సరాల క్రితం కొత్తపల్లి సమీపంలో చిరుత దాడిచేసి మేకను చంపి పక్కనే ఉన్న అటవీ ప్రాంతాంలోకి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత చిరుత మళ్లీ మళ్లీ ఏదో ఒకచోట దాడులకు పాల్పడుతూనే ఉంది. దాడి జరగగానే ఆ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు బోన్లు, సీసీ కెమరాలు ఏర్పాటు చేస్తున్నారు అటవీ అధికారులు. కానీ చిరుత మరో చోట దాడికి పాల్పడుతోంది. ఇలా ఇప్పటికి వరకు 20 చోట్ల గొర్రెలు, మేకలు, ఆవు దూడలను చంపి తినింది. వాటి యజమానులు 15 మందికి అటవీశాఖ అధికారులు నష్ట పరిహారాన్ని అందజేశారు. ఫారెస్టు అధికారులు త్వరగా చిరుతపులిని బంధించి భయాన్ని తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే ఆరు చోట్ల అధికారులు సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు.

చిరుతపులిని పట్టుకోవాలి

చిరుతపులి పలు చోట్ల గొర్రెలు, మేకలు,పశువులపై దాడి చేసి చంపుతోంది. గ్రామాల్లోరైతులు, గొర్రెలు, మేకల కాపర్లుభయాంధోళనకు గురవుతున్నారు.అటవీశాఖ అధికారులు చిరుతపులినిబంధించి పట్టు కోవాలి. నందివనపర్తిగ్రామంలో చిరుతదాడి చేసి ఆవునుచంపింది. రైతుకు నష్టపరిహారాన్ని త్వరగాఅందజేయాలి. ఉదయశ్రీ, సర్పంచ్, నందివనపర్తి

రాత్రి వేళ ఒంటరిగా వెళ్లొద్దు

అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న బావులువద్దకు రైతులు రాత్రి సమయంలోఒంటరిగా వెళ్లొద్దు . అడవికి దగ్గరగా ఉన్నపశువుల పాకల్లో గొర్రెల మందలనుతొలగించాలి. పొలాల వద్ద మంచెలుఏర్పాటు చేసుకోవాలి. రాత్రిళ్లు మంటలుపెట్టాలి. లైట్లు ఆన్ చేసి ఉంచాలి. ఆకలిఅయినప్పుడు చిరుత దాడి చేస్తోంది.అటవీ ప్రాంతం ఎక్కు వగా ఉండటంతో నేవేర్వేరు చోట్ల దాడులు చేస్తోంది. సత్యనారాయణ, అటవీ రేంజ్ అధికారి

రెండేళ్ల నుంచి చిక్కడం లేదు

రెండేళ్ల నుంచి చిరుతపులి దాడి చేస్తోంది.మేకలు,గొర్రెలు, పశువులను పొట్టన పెట్టుకుంది. అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా చిరుత చిక్కడం లేదు.ఎలాగైనా చిరుతను పట్టు కోవాలి. లేకుంటేబావుల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. భిక్షపతి, కొత్తపల్లి