చనిపోయిన టీచర్ కు ఎన్నికల విధులు

చనిపోయిన టీచర్ కు ఎన్నికల విధులు
  • షాద్ నగర్ లో అధికారుల నిర్వాకం 

షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా అధికారులు ఏకంగా చనిపోయిన టీచర్ కు ఎన్నికల విధులు వేశారు. ట్రైనింగ్ కు రావాలని లిస్టులో అతని పేరు పెట్టారు. ఇది చూసిన తోటి ఉద్యోగులు అవాక్కయ్యారు. ఎప్పుడో చనిపోయిన ఆయనకు ట్రైనింగ్ ఎలా ఇస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది.  జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం వెల్జర్ల లో ఎల్ఎఫ్ఎల్ టీచర్ గా పి.రామచందర్ డ్యూటీ చేస్తూ.. గుండెపోటుతో 8 నెలల కిందట చనిపోయారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ట్రైనింగ్ కు రమ్మంటూ అధికారులు లిస్టులో ఆయన పేరు ప్రకటించారు. రాంచందర్ పేరుతో పాటు ఐడీ నంబర్ ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చనిపోయిన వ్యక్తికి ఎలా ట్రైనింగ్ ఇస్తారని, కింది స్థాయి అధికారులు  ఏ వివరాలు తెలుసుకోకుండానే పై లిస్ట్ పంపించారా.. అనేది చర్చనీయాంశమైంది. దీనిపై వివరణ కోరారు.. స్థానిక ఎంఈఓ అప్డేట్ చేయకపోవడంతోనే పొరపాటున అలా వచ్చిందని రంగారెడ్డి డీఈవో సుశీందర్ రావు చెప్పారు. దాన్ని సరిచేస్తామని తెలిపారు.