కల్వకుర్తి నియోజకవర్గంలో జనవరి14 న గ్రామాల్లో ముగ్గుల పోటీలు

కల్వకుర్తి నియోజకవర్గంలో జనవరి14 న గ్రామాల్లో ముగ్గుల పోటీలు

 ఆమనగల్లు, వెలుగు : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 14న ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్​మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.3 వేలతోపాటు పట్టుచీర, ద్వితీయ బహుమతి రూ.2 వేలతోపాటు పట్టుచీర ఇస్తామని వెల్లడించారు. ఒకటి నుంచి ఐదు మంచి ముగ్గులకు ఒక్కొక్క పట్టు చీర అందిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.