భద్రాచలం, వెలుగు : జీయర్ మఠం ఆధ్వర్యంలో గురువారం రామాలయంలోని చిత్రకూట మండపంలో రాపత్ సేవ జరిగింది. స్వామిని ఊరేగింపుగా చిత్రకూటమండపానికి తీసుకురాగా, శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భక్తులు పాల్గొన్నారు. స్వామికి విశేష పూజలు, వేదపారాయణాలు చేశారు.
మరోవైపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామికి అధ్యయన పారాయణాలు నిర్వహించారు. సీతారాముల నిత్య కల్యాణం జరిగింది. నమ్మాళ్వార్ పరమపదోత్సవం వేదోక్తంగా వేదపండితులు జరిపించారు. సాయంత్రం వైకుంఠ రామునికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది.
