'ది వారియర్' కోసం తమిళ హీరో సాయం

'ది వారియర్' కోసం తమిళ హీరో సాయం

టాలీవుడ్ హీరో రామ్ 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ పోతినేని తమిళ క్రేజీ హీరో శింబును కలిశాడు.

దర్శకుడు లింగసామికీ శింబుకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండడంతో ఆయన ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అంతేకాదు 'ది వారియర్' కోసం శింబు 'బుల్లెట్' సాంగ్ పాడిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంది. కాగా,  ఈ మూవీలో రామ్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తోంది.