నేపాల్ ప్రధానిగా బాలెన్ షా..! ఎవరీయన?

నేపాల్ ప్రధానిగా బాలెన్ షా..! ఎవరీయన?

జనరేషన్ జెడ్ విద్యార్థుల ఆందోళన నేపాల్ అట్టుడుకిపోతోంది. ప్రధాని కేపీ కపిల్ శర్మ రాజీనామా చేశారు. రాజధాని ఖట్మండుతో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. దేశ ఆర్థిక మంత్రిని నడివీధుల్లో బట్టలూడదీసి కొట్టారు. రెండు రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో 20 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇది ప్రస్తుతం హిమాలయన్ దేశం నేపాల్ లో పరిస్థితి.. ప్రధానిగా కేపీ శర్మ రాజీనామా చేశాక ఆ స్థానంలో ఎవరు రానున్నారు.. అంటే బాలెన్ షా పేరు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది. ఎవరీ బాలెన్ షా..?

విద్యార్థుల ఆందోళనతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. ఈ క్రమంలో నేపాల్ రాజధాని ఖట్మండ్ యువ మేయర్ బాలేంద్ర షా పేరు ఆన్ లైన్ లో బాగా ప్రచారం సాగుతోంది. దీంతో అందరి దృష్టి బాలెన్ వైపు మళ్లింది. 

"బాలెన్" గా ప్రసిద్ధి చెందిన ఈ 35 ఏళ్ల వ్యక్తి రాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారారు.. మే 2022 నుండి ఖాట్మండు 15వ మేయర్‌గా పనిచేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.పార్టీ మద్దతు లేకుండా ఆ పదవిని నిర్వహించిన మొదటి వ్యక్తి అయ్యారు.

ఇంజనీర్ అయిన బాలెన్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉన్నాడు. భారతదేశంతో సంబంధాలున్నాయి. అతను కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌ను అభ్యసించాడు. రాజకీయాల్లోకి రాకముందు అతను నేపాల్ హిప్-హాప్ సన్నివేశంలో చురుకుగా పాల్గొనేవారు.

అవినీతి,అసమానతలను హైలైట్ చేయడానికి తన సంగీతాన్ని ఉపయోగించేవాడు. ఇది కేవలం సంగీతం మాత్రమే కాదు..సామాజిక సమస్యలు, నిరసనలు, రాజకీయ అవగాహన తెలియజేసే వేదికగా కూడా ఉపయోగిస్తున్నారు.