
డేస్టార్ షెమ్యూల్ షువా పీటర్సన్..టోరీ లానెజ్ గా ఫేమస్..ప్రముఖ కెనడియన్ సింగర్..రాపర్.. పాటల రచయిత..రికార్డ్ ప్రొడ్యూసర్.. ప్రస్తుతం లానెజ్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒళ్లంతా కత్తిపోట్లతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లానెజ్ పై కాలిఫోర్నియా జైలులో హత్యాయత్నం జరిగింది. జైలులోనే చంపబోయారా? ఎవరూ?..అసలేం జరిగింది?
సోమవారం (మే12) కాలిఫోర్నియా జైలులో జరిగిన దాడిలో సింగర్ టోరీ లానెజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ హత్యాయత్నం కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న లానెజ్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. 4 కత్తిపోట్లతో అతని శరీరం తూట్లు పొడిచారు.. అతని ఊపిరితిత్తులు చిత్తుచిత్తు అయ్యాయి. అయినప్పటికీ లానెజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
టోరీ లానెజ్ జైల్లో ఎందుకున్నాడు?..
ప్రముఖ కెనడియన్ హిప్-హాప్ స్టార్ మేగాన్ థీ స్టాలియన్ గురించి మ్యూజిక్ ప్రియులకు తెలిసే ఉంటుంది. జూలై 2020న కైలీ జెన్నర్ హాలివుడ్ హిల్స్ లో మేగాన్ పై తుపాకీతో దాడి చేశారు. ఆ దాడి చేసింది టోరీ లానెజ్..మేగాన్ పాదాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. భయంతో పరుగులు పెడుతున్న మేగాన్ ను ‘‘ఇప్పుడు డ్యాన్స్ చెయ్.. చూస్తాను’’ అంటూ గట్టిగా అరుస్తూ భీభత్సం సృష్టించాడు టోరీ లానెజ్.
టోరీ లానెజ్ జరిపిన కాల్పుల్లో మేగాన్ రెండు పాదాల్లో బుల్లెట్లు ముక్కలు దూసుకుపోయాయి. సర్జరీ చేసి తీశారు. ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత టోరీ లానెజ్ దోషిగా కోర్టు నిర్ధారించింది.. పదేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం కాలిఫోర్నియా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
మేగాన్ పాదాలపైనే టోరీ ఎందుకు కాల్పులు జరిపాడు?
మేగాన్ పై టోరీ కాల్పులు కేసు హిప్-హాప్ కమ్యూనిటీలో ఓ సంచలనంగా మారింది. పోలీసులంటే భయపడే నల్లజాతి బాధితులు,హిప్-హాప్‌లో లింగ వివక్ష, ఆన్‌లైన్ విష ప్రచారం,నల్లజాతి మహిళలు అనుభవించే స్త్రీ ద్వేషం వంటి సమస్యలను లేవనెత్తింది.
30 ఏళ్ల మేగాన్ థీ స్టాలియన్ ప్రముఖ నటి.. ప్రజాదరణ పొందింది. 2021లో ఉత్తమ కళాకారిణిగా ‘‘గ్రామీ’’ని అందుకుంది. నల్లజాతి మహిళ పట్ల హిప్ హాప్ లో లింగవివక్ష ఎదుర్కొంటున్నారని అందులో భాగంగానే టోరీ లానెజ్ ఆమెపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే టోరీ లానెజ్ అలాంటి వాడు కాదు.. న్యాయవ్యవస్థ మేగాన్ కు ఉన్న పలుకుబడి అతడిని దోషిని చేశాయని టోరీ లానెజ్ పేరెంట్స్, ఫ్రెండ్స్, బంధువులు అంటున్నారు.
లానెజ్‌పై సోమవారం ఉదయం 7:20 గంటలకు టెహచాపిలోని కాలిఫోర్నియా కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్‌లోని హౌసింగ్ యూనిట్‌లో దాడి జరిగిందని అక్కడి పోలీసులు వెల్లడించారు. అనేకసార్లు కత్తిపోట్లకు గురయ్యాడని, అతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇప్పుడు అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు.