నిమ్స్ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్

నిమ్స్ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
  •     పేషెంట్ మెదడులో కణితిని తొలగించి డాక్టర్ల సక్సెస్  

పంజగుట్ట,వెలుగు:  నిమ్స్​ డాక్టర్లు అరుదైన ఆపరేషన్​ చేసి పేషెంట్ ప్రాణాలు కాపాడారు. సంగారెడ్డికి చెందిన నరహరి5(35) కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ.. నెల రోజుల కిందట నిమ్స్​ ఆస్పత్రిలో న్యూరో సర్జరీ డాక్టర్లను సంప్రదించాడు. అతనికి వైద్య పరీక్షలు చేసి మెదడు మధ్యలో కణితి (బ్రెయిన్​ట్యూమర్​)ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్​ ద్వారా తొలగించాలని పేషెంట్ కు సూచించారు.  

న్యూరో సర్జన్  డాక్టర్ తిరుమల్ టీమ్ నితిన్, విశాల్​, దీపక్​ ఆపరేషన్ చేసి నరహరి మెదడులో కణితిని తొలగించారు.  ఆపరేషన్​ సక్సెస్ అవడంతో ఆస్పత్రి డైరెక్టర్​ బీరప్ప, న్యూరో సర్జన్ వింగ్ హెడ్ డాక్టర్​ సుచంద, డాక్టర్​వంశీ కృష్ణను అభినందించారు.