మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్లో పదేండ్ల బాలుడికి అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్ ఆడెపు నవీన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన అభిరామ్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు తమ హాస్పిటల్కు తీసుకురాగా.. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించి కొలనో స్కోపీ ద్వారా రెక్టల్లో కణితి ఉన్నట్లు గుర్తించామని, హాట్ స్నేర్ పరికరం ద్వారా తొలగించామన్నారు.
ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా విజయవంతంగా ఆపరేషన్చేశామని పేర్కొన్నారు. చిన్న పిల్లల్లో ఇటువంటి కణితులు రావడం అరుదని, వాటిని తొలగించకపోతే భవిష్యత్లో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని డాక్టర్ నవీన్ వివరించారు.
