తెలుగులోనే  హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా: రాషా తడానీ

తెలుగులోనే  హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా: రాషా తడానీ

బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ.. 'శ్రీనివాస మంగాపురం'  చిత్రంతో టాలీవుడ్‌‌‌‌కు పరిచయం అవుతోంది కృష్ణ మనవడు, జయకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకుడు.  వైజయంతి మూవీస్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించారు. జులై 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాషా తడానీ ఇలా ముచ్చటించింది.  

‘‘దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పిన తీరు, పాత్రల ఎమోషన్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆయన  హీరోయిన్ పాత్రలను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఇందులో  నేను పోషించిన ‘మంగ’ పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది.  ఓవైపు బబ్లీ, ఎనర్జిటిక్ అమ్మాయిగా కనిపిస్తూనే మరోవైపు హుందాతనం, భావోద్వేగాలతో కూడిన పాత్రగా కనిపిస్తుంది.  

నటిగా నాకు మంచి స్కోప్ ఇచ్చిన క్యారెక్టర్ ఇది. పర్సనల్‌‌‌‌గా కూడా కనెక్ట్‌‌‌‌ అయ్యాను. యాక్షన్, లవ్,  ఎమోషన్, కామెడీ అన్నీ ఇందులో ఉన్నాయి. జయకృష్ణ  చాలా కూల్. సెట్స్‌‌‌‌లో ఎప్పుడూ సరదాగా ఉండేవారు.  మోహన్ బాబు గారితో వర్కింగ్ గొప్ప ఎక్స్‌‌‌‌పీరియెన్స్.   తిరుపతిలో షూట్ జరగడం గుర్తుండిపోయే అనుభవం. తెలుగు సినిమాపై   చిన్నప్పట్నుంచీ  ప్రత్యేకమైన అభిమానం ఉంది. 'బాహుబలి' చూసిన తర్వాత టాలీవుడ్ నుంచే పరిచయం అవ్వాలనుకున్నా. అందులోనూ  వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా’’.