- నేడు శ్రీలంకతో టైటిల్ ఫైట్
షార్జా: తెలుగు క్రికెటర్ షేక్ రషీద్(90 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌కు తోడు బౌలర్లంతా టాప్ పెర్ఫామెన్స్ చేయడంతో ఇండియా అండర్–19 టీమ్ ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అండర్–19 ఆసియా కప్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 103 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగే టైటిల్ ఫైట్‌లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 243/8 స్కోరు చేసింది. వైస్ కెప్టెన్, ఆంధ్ర క్రికెటర్ రషీద్ సత్తా చాటగా.. విక్కీ(28 నాటౌట్), కెప్టెన్ యష్ ధూల్ (26), రాజ్ బవా(23) విలువైన రన్స్ చేశారు. బంగ్లా బౌలర్లలో రకీబల్ హసన్(3/41) ముగ్గుర్ని ఔట్ చేశాడు. అనంతరం 244 రన్స్ ఛేజింగ్‌లో 38.2 ఓవర్లు ఆడిన బంగ్లా 140కే ఆలౌటైంది. అరిఫుల్ ఇస్లామ్(42) టాప్ స్కోరర్. ఇండియా బౌలర్లలో రాజ్‌వర్ధన్(2/36), రవి కుమార్(2/22), రాజ్ బవా (2/26), విక్కీ(2/25) రాణించారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 22 రన్స్ తేడాతో గెలిచిన శ్రీలంక ఫైనల్ చేరింది.
