ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ రాశి. ఆ తర్వాత మెల్లగా ఫేడవుటయ్యింది. రీ ఎంట్రీ ఇచ్చి కళ్యాణ వైభోగమే, లంక లాంటి కొన్ని సినిమాలు చేసింది కానీ సెకెండ్ ఇన్నింగ్స్ స్పీడందుకోలేదు. అయితే ఈసారి పవర్‌ఫుల్ పాత్రతో వచ్చేందుకు రెడీ అయ్యింది రాశి. పోలీసాఫీసర్ క్యారెక్టర్‌కి కమిటయ్యింది. రీసెంట్‌గా ఆమె ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి యూనిఫామ్‌లో రాశి దిగింది. ముఖానికి మాస్క్ కట్టుకుని ఉంది. షూటింగ్ జరిగే బిల్డింగ్ లోకి నడిచింది. అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, కరోనా విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారు అనేది చూపించింది. అయితే అది సినిమానా, సీరియలా లేక వెబ్ సిరీస్ లాంటిదేదైనానా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కాకపోతే చక్కగా స్లిమ్ అయ్యి అట్రాక్టివ్‌గా కనిపించడంతో ముందు ముందు మరిన్ని చాన్సులు కొట్టేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

