
చిట్టగాంగ్: టెస్ట్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ (51; 4/47)అదిరిపోయే పెర్ఫామెన్స్ చేశాడు. రషీద్ మెరుపు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విజృంభించడంతో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌లో అఫ్గాన్ రెండో రోజే పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 271/5తో శుక్రవారం ఆట కొనసాగించిన అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 342 రన్స్ వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ అస్గర్ అఫ్గన్ (92), అఫ్సర్ జజాయ్ (42) త్వరగానే ఔటైనా.. కెప్టెన్ రషీద్ 61 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అనంతరం అతను బంతితోనూ మాయ చేయడంతో సెకండ్ డే చివరకు బంగ్లా 198/8తో కష్టాల్లో చిక్కుకుంది. మోమినుల్ హక్ (52) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం మొసాదెక్ (44 బ్యాటింగ్), తైజుల్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.