నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫుల్ జోష్ లో ఉంది. తన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిత్యం వార్తల్లో ఉండే ఈ బ్యూటీ మరోసారి తన మనసులోని మాటలతో వార్తల్లో నిలిచారు. తన సహనటుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం, పెళ్లి వార్తలు జోరుగా షికారు చేస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ గా ఓపెన్ అయింది. విజయ్ తో తన వివాహంపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నా భాగస్వామి ఇలా ఉంటే చాలు!
లేటెస్ట్ హానెస్ట్ టౌన్‌హాల్ నిర్వహించిన క్యాంపస్ ఇంటరాక్షన్‌లో రష్మిక పాల్గొంది. అక్కడ ఆమెను 'ఆదర్శవంతమైన భాగస్వామి' అంటే ఎవరై ఉంటారు అని అడగ్గా, రష్మిక ఎంతో లోతుగా సమాధానం చెప్పింది. సాధారణంగా కాకుండా, జీవితాన్ని లోతైన కోణం నుంచి అర్థం చేసుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి తనకు కావాలని చెప్పింది.
"నా భాగస్వామి నా జీవితాన్ని లోతైన స్థాయిలో అర్థం చేసుకోగలవాడు అయి ఉండాలి. పరిస్థితులను అతను తన సొంత దృక్కోణం నుంచి ఎలా చూస్తాడు అనేది ముఖ్యం. నిజాయితీగా, మంచి మనసుతో ఉండి, అన్నిటికంటే ముఖ్యంగా నాతో కలిసి యుద్ధం చేయగలవాడు లేదా నా కోసం పోరాడగలవాడు అయి ఉండాలి. రేపు నాపై ఒక యుద్ధం వస్తే, ఆ మనిషి నాతో కలిసి నిలబడతాడని నాకు నమ్మకం ఉండాలి. నేను కూడా అతని కోసం అదే చేస్తాను. అతని కోసం నేను ఏ క్షణంలోనైనా తూటాను తీసుకుంటాను (I will take a bullet for him). అదే నా ఆదర్శ భాగస్వామి," అంటూ రష్మిక ప్రేమకు, విశ్వాసానికి ఇచ్చిన ప్రాముఖ్యతను వివరించింది.
విజయ్‌నే పెళ్లి చేసుకుంటా!
ఇదే సెషన్‌లో, రష్మికను సరదాగా రాపిడ్-ఫైర్ ప్రశ్న అడిగారు అభిమానులు. తను పనిచేసిన నటుల్లో ఎవరిని 'చంపుతావు ', ఎవరిని 'పెళ్లి చేసుకుంటావు ', ఎవరితో 'డేటింగ్ చేస్తావు ' అని అడిగారు. దీనికి రష్మిక ఇచ్చిన సమాధానం అభిమానుల నుండి పెద్ద ఎత్తున కేకలు తెప్పించింది. నవ్వుతూ... డేటింగ్ కోసం తాను ప్రఖ్యాత అనిమే పాత్ర నరుటోను ఎంచుకుంటానని చెప్పింది., పెళ్లి కోసం మాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది రష్మిక . ఆమె ఈ పేరు చెప్పగానే ఆడిటోరియం చప్పట్లతో, కేకలతో దద్దరిల్లిపోయింది. ఈ ప్రకటన విజయ్‌తో ఆమె వివాహం గురించి వస్తున్న ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఫిబ్రవరిలో పెళ్లి?
గీత గోవిందం , డియర్ కామ్రేడ్ చిత్రాల నుంచి ఈ జంట ప్రేమలో ఉందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో విజయ్ టీమ్ ఈ జంట నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. ఆ తర్వాత రష్మిక రింగ్ ధరించి కనిపించడం, అలాగే ఆమె పెళ్లి సన్నాహాలు వేగవంతం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి వేదికల పరిశీలన కోసం రష్మిక , విజయ్ ఉదయ్‌పూర్ కు వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. వారి వివాహం ఫిబ్రవరి 2026లో గ్రాండ్‌గా జరగవచ్చని విజయ్ దేవరకొండ సన్నిహిత వర్గాలు కూడా సూచించాయి. నిశ్చితార్థం, పెళ్లి గురించి ఈ జంట అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విజయ్ తోనే నా పెళ్లి.!: రష్మిక మందాన్న
— Telugu Reporter (@TeluguReporter_) November 8, 2025
ఎట్టకేలకు నోరు విప్పిన నేషనల్ క్రష్ రష్మిక..
ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఎవరితో డేట్ & మ్యారేజ్ అని ఓ అభిమాని అడగ్గా.. 'జపనీస్ యానిమే నరుటోతో డేట్ చేస్తాను.విజయ్ ని పెళ్లి చేసుకుంటాను' అని రష్మిక సమాధానమిచ్చారు.
కాగా, వీరిద్దరి వివాహం… pic.twitter.com/EDWl0adXcV
