బేబీ సినిమా చూసి ఏడ్చేసిన రష్మిక.. సినిమా సూపర్ అంటూ సిగ్నల్

బేబీ సినిమా చూసి ఏడ్చేసిన రష్మిక.. సినిమా సూపర్ అంటూ సిగ్నల్

నేషనల్ క్రాష్ రష్మిక మందనా(Rashmika mandana) కన్నీళ్లు పెట్టుకున్నారు. గత రాత్రి బేబీ(Baby) సినిమా ప్రీమియర్ చూసిన ఆమె భవోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ALSOREAD:బేబీ సక్సెస్ పై విజయ్ ట్వీట్.. ఇక మిగిలింది నువ్వే అన్నా!

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ బేబీ. కలర్ ఫోటో(Color photo) రచయిత సాయి రాజేష్(Sai rajesh) ఈ సినిమాను తెరకెక్కించారు. విరాజ్ అశ్విన్(Viraj ashwin) మరో ముఖ్యపాత్రలో కనిపించిన ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుండి బేబీ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా ఎమోషనల్ గా ఉందంటూ చెప్పుకుంటున్నారు. అన్ని ఏరియాల నుండి సినిమాకు యునానిమస్ హిట్ టాక్ రావడంతో.. బేబీ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఇక చాలా రోజుల తరువాత వచ్చిన ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా కావడంతో ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే హౌస్ ఫుల్ బుకింగ్స్ తో నడుస్తున్న ఈ సినిమాకు.. వీకెండ్స్ కలెక్షన్స్ ఇంకా పెరిగీ అవకాశం ఉంది.    

ఇక తాజాగా ఈ సినిమా ప్రివ్యూ చూసిన రష్మిక కూడా భావోద్వేగానికి లోనయ్యారట. రష్మిక సినిమా చూసి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రష్మిక ఎమోషనలై కన్నీళ్లు పెటుకున్నట్టుగా కనిపించారు. అంతేకాదు సినిమా ఎలా ఉందని అడగగా.. సూపర్ అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ(Vijay devarkonda) కూడా సినిమా బాగుంది అంటూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు.