
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda) హీరోగా ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) హీరోయిన్ గా సాయి రాజేష్(Sai rajesh) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ బేబీ(Baby). లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా జులై 14 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమా ఆడియన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.
ALSOREAD:బేబీ సినిమా చూసి ఏడ్చేసిన రష్మిక.. సినిమా సూపర్ అంటూ సిగ్నల్
ఇక తాజాగా బేబీ సినిమా సక్సెస్ పై ఆనంద్ దేవరకొండ అన్నయ్య రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ట్విట్టర్ వేదికగా స్పందించారు. " ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఇద్దరు పిల్లలు సినిమా చాలా బాగా చేశారు. బేబీ చాలా ఎఫెక్టీవ్ సినిమా. ఆనంద్, విరాజ్(Viraj ashwin), వైష్ణవి చాలా ఏడిపించారు. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి" అంటూ బేబీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చుసిన రౌడీ హీరో ఫ్యాన్స్ తమ తమ స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. తమ్ముడు హిట్టు కొట్టాడు.. మరి నువ్వు ఎప్పుడు కొడతావన్నా హిట్టు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
I am so happy ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) July 14, 2023
These babies did it. So well. So much impact.
This was us last night after the premiers, after a lot of crying, we were all then filled with Big smiles and laughter.
Missing @viraj_ashwin @sairazesh @VijaiBulganin #BabyTheMovie pic.twitter.com/JRLpS4Spoz