రష్మిక మందన@10.. ట్విట్టర్లో ట్రెండింగ్

రష్మిక మందన@10.. ట్విట్టర్లో ట్రెండింగ్

రష్మిక మందన వరుస హిట్లతో క్రేజ్ పెంచుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం టాప్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. కన్నడలో కిరాక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ సినిమా హిట్ కావడంతో చాలా పాపులర్ అయ్యింది.  తెలుగు,తమిళం,కన్నడ చిత్రాలతో నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది. కిరాక్ పార్టీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక  10 సినిమాలు పూర్తి చేసుకుంది.

తెలుగులో ఛలో సినిమాతో హిట్ కొట్టి అందరి దృష్టి ఆకర్షించింది రష్మిక. తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రేడ్,సరిలేరు నీకెవ్వరు,నితిన్ తో భీష్మ సినిమాలో నటించింది. భీష్మ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతుంది. రష్మిక నటించిన భీష్మ ఆమెకు పదో సినిమా కావడంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ #Rashmika10onFeb21  అనే హ్యాష్ ట్యాగ్ తో హల్ చల్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ఇండియా ట్రెండింగ్ లో ఉంది.  ఆమె ఫ్యాన్స్ ట్వీట్స్ కు రష్మిక రిప్లై ఇచ్చింది. ఓ మై గాడ్ అపుడే పదో సినిమానా? నమ్మలేకపోతున్నా అని ట్వీట్ చేసింది. ‘నాకు ఇప్పటికీ కొత్తగా ఉంది..తాను విభిన్న పాత్రల్లో నటించినందుకు కాకుండా ఇంతమంది అభిమానుల మద్దతు ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకుంటాను. ఐ లవ్యూ‘ అని ట్వీట్ చేసింది.