
లండన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ నథింగ్సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్నను నియమించుకున్నట్టు ప్రకటించింది. సీఎంఎఫ్ ఉత్పత్తుల ప్రచారం కోసం తయారు చేసిన డిజిటల్, ప్రింట్, టీవీసీ యాడ్స్‌లో ఆమె కనిపిస్తుంది. రష్మికను సీఎంఎఫ్ కుటుంబా నికి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నామని నథింగ్ ఇండియా ప్రెసిడెంట్ విశాల్ భోలా అన్నారు. ఇయర్‌బడ్స్, వాచీల వంటి ప్రొడక్టులను సీఎంఫ్ తయారు చేస్తోంది.