Thamma Trailer: హారర్.. కామెడీ.. రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్న థామా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Thamma Trailer: హారర్.. కామెడీ.. రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్న థామా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరుస చిత్రాలతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో దూసుకెళుతోంది రష్మిక మందన్న. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌ ఖురానాకు జంటగా ఆమె నటిస్తున్న చిత్రం ‘థామా’.  ఆదిత్య సర్పోత్దార్ దీనికి దర్శకుడు. మాడాక్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌ హారర్  కామెడీ యూనివర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి మరో హారర్ కామెడీ మూవీ ఇది. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు.

అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో సాగే రొమాంటిక్‌‌‌‌‌‌‌‌ కామెడీ సినిమా ఇది. గురువారం ముంబైలో జరిగిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఒకప్పుడు మనుషులను రక్షించడానికి సృష్టించబడ్డ బేతాళుడు (నవాజుద్దీన్‌‌‌‌‌‌‌‌ సిద్ధీఖీ), జనాన్ని చంపుతూ తన బలాన్ని పెంచుకుంటాడు. దీంతో అమ్మవారి శక్తిని ఉపయోగించి అతన్ని ఓ గుహలో బంధిస్తారు. వేల సంవత్సరాల తర్వాత హీరో ఆయుష్మాన్ కారణంగా అతను తప్పించుకుంటాడు.

మరోవైపు రష్మికతో పరిచయం, ప్రేమ తర్వాత ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌లో మార్పులు వస్తాయి. అతని కళ్లు, పళ్లు మారిపోవడంతో పాటు కొన్ని అతీంద్రియ శక్తులు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది.. ఇందులో రష్మిక క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏమిటి.. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో కనిపించిన సత్యరాజ్ పాత్ర ప్రాధాన్యత ఏమిటి లాంటి విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.

హారర్, కామెడీని మిక్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కట్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్ చేసింది. ఇలాంటి ఓ హారర్ కామెడీ సినిమాలో ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్ చేయడం గర్వంగా ఉందని ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ సందర్భంగా రష్మిక చెప్పింది. దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.