
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వ్యాపార రంగంలోకి అడుగుపెడుతోంది. వరుస పాన్ ఇండియా హిట్స్ అందుకుంటూ ఊపు మీదున్న నేషనల్ క్రష్ కొత్త బిజినెస్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది రష్మిక. అంతకు ముందు తన తల్లి సుమన్ మందన్నతో వీడియో కాల్ లో మాట్లాడిన రష్మిక బిజినెస్ లాంచ్ చేస్తున్న విషయాన్ని తల్లితో పంచుకుంది. మీరు చెప్పిన బిజినెస్ లాంచ్ చేస్తున్నానంటూ తల్లికి తెలిపింది రష్మిక. అందుకు తల్లి సుమన్ మందన్న రష్మికకు శుభాకాంక్షలు తెలిపింది.
మరొక ఇన్స్టా పోస్ట్ లో తాను బిజినెస్ లాంచ్ చేస్తున్న విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది రష్మిక. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో రష్మిక ఏ బిజినెస్ స్టార్ట్ చేయనుంది అన్న అంశంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చాలామంది హీరోయిన్ల లాగానే రష్మిక కూడా తన సొంత ఫాషన్ బ్రాండ్ ను లాంచ్ చేయనుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
రష్మిక స్టార్ట్ చేయనున్న బిజినెస్ గురించి మరిన్ని డీటెయిల్స్ సోమవారం ( జులై 21 ) తెలుస్తుందని ఇంస్టాగ్రామ్ వీడియోలో పేర్కొంది రష్మిక. ఇదిలా ఉండగా..రష్మిక ప్రస్తుతం రాహుల్ రవీంద్ర డైరెక్షన్లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సాంగ్ లో రష్మిక, దీక్షిత్ ల డ్యాన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది ఈ సాంగ్. భారీ హైప్ క్రియేట్ చేసింది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రష్మిక కెరీర్లో ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా. సెప్టెంబర్ 5న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.