
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) దక్షిణాదికి చెందిన అగ్ర హీరోయిన్స్ లో ఒకరు. ఛలో మూవీలోని తన నటనతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన భీష్మా మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక టాలీవుడ్ లో వరుస మూవీస్ తో దూసుకెళ్తున్న రష్మికను ఓ మూవీ నుంచి తప్పించారని వార్తలు వినిపిస్తోన్నాయి.
ప్రస్తుతం వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో వస్తున్న మూవీ లో మొదట రష్మిక ను ఎంచుకున్న టీమ్, ఇప్పుడు ఆ మూవీ నుంచి తప్పించారని టాక్ వినిపిస్తోంది. VNR త్రయం అని పిలువబడే ఈ కాంబో నుంచి రష్మిక ప్లేస్ లో శ్రీలీల(Sreeleela) ను తీసుకున్నారని తెలుస్తోంది.
నిజానికి వెంకీ ఈ మూవీ కు టైటిల్ ప్రకటించకపోయినప్పటికీ.. వర్కింగ్ టైటిల్‌గా VNR త్రయం అని పేరు పెట్టారు. దీంతో రష్మిక ఈ ప్రాజెక్ట్ లో కన్ఫర్మ్ అయినట్లే అనుకున్న.. ఇప్పుడు తన ప్లేస్ లో శ్రీలీల రావడంతో నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి.
ప్రస్తుతం రష్మిక 'పుష్ప: ది రైజ్' మూవీ తో పాటు రణబీర్ తో యానిమల్, రెయిన్ బో.. ఇలా పలు మూవీస్ తో బిజీగా ఉండటంతో తానే తప్పుకున్నట్లు సమాచారం. అయితే VNR ప్రాజెక్ట్ నుంచి రష్మికనే స్వయంగా తుప్పుకున్నారా.. లేక తప్పించారా అనేది మాత్రం ఇంకా ఆఫీసియల్ గా ప్రకటన రాలేదు. కాగా.. ఇప్పటికే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే స్థానంలోనూ శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. రష్మిక తర్వాత శ్రీలీలనే టాప్ హీరోయిన్‌గా కనిపిస్తోంది.
ఈ ఏడాదిలోనే ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, వీడీ12, ఉస్తాద్ భగత్ సింగ్‌తో సహా దాదాపు ఏడు చిత్రాలలో నటిస్తోంది. గోల్డెన్ భామగా తన కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రీలీల అందంలోనూ, డ్యాన్స్ లోను కుర్రకారును ఫిదా చేస్తోంది. ఇప్పుడు రష్మిక తప్పుకుందనే వార్తలు వినిపిస్తుండగా.. చిత్ర బృందం ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.