ఇండస్ట్రీకొచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న రష్మిక మందన్నా

ఇండస్ట్రీకొచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న రష్మిక మందన్నా

‘కిర్రాక్ పార్టీ’తో కన్నడ,  ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి  అతి తక్కువ టైమ్‌‌లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది  రష్మిక మందన్నా. ఓ వైపు సౌత్‌‌తోపాటు మరోవైపు బాలీవుడ్‌‌లోనూ సత్తా చాటుతోంది. తను  సినీ ఇండస్ట్రీకొచ్చి 9 ఏండ్లు పూర్తి చేసుకుంది.  ఈ 9 ఏళ్ల కెరీర్‌‌‌‌లో నాలుగు భాషల్లో 25 సినిమాల్లో నటించింది రష్మిక. ఈ సందర్భంగా తను నటించిన సినిమాల పేర్లతో ఓ స్పెషల్ స్టిల్‌‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెర్సటైల్ రోల్స్ చేస్తూ..  డెడికేషన్‌‌తో తన జర్నీ కొనసాగుతుందని క్యాప్షన్ ఇవ్వడం ఆకట్టుకుంది.  పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్‌‌ను మరింత పెంచుకుంటోంది రష్మిక.  ఆమె  నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా చిత్రాలు  బాక్సాఫీస్ దగ్గర  రూ.వంద కోట్లకు పైగా  కలెక్షన్స్‌‌ను రాబట్టాయి. ఈ విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌‌లో నటిస్తోంది రష్మిక. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘మైసా’ చిత్రంలో ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తున్న రష్మిక.. హిందీలో ‘కాక్‌‌టైల్‌‌’ మూవీ చేస్తోంది.