మొదలైన రష్మిక మందన్న మైసా మూవీ షూటింగ్

 మొదలైన రష్మిక మందన్న మైసా మూవీ షూటింగ్

రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’.  డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రంతో  దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి  నిర్మిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. నిర్మాత  సురేష్ బాబు క్లాప్‌‌‌‌ కొట్టగా, రవి కిరణ్ కోలా కెమెరా స్విచాన్  చేశారు. స్క్రిప్ట్‌‌‌‌ను మేకర్స్‌‌‌‌కు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు షాట్‌‌‌‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి  హైదరాబాద్‌‌‌‌లో ప్రారంభమవుతుంది. 

మొదటి షెడ్యూల్‌‌‌‌లో రష్మికతో పాటు టీమ్ అంతా జాయిన్ అవుతున్నారు. గోండ్  తెగల బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గాఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు,  రష్మికను  ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్‌‌‌‌‌‌‌‌లో చూపించబోతున్నట్టు  మేకర్స్ తెలియజేశారు. మరిన్ని ఎక్సయిటింగ్‌‌‌‌ అప్‌‌‌‌డేట్స్ త్వరలోనే  రివీల్ చేయనున్నామని చెప్పారు.  ఇప్పటికే విడుదలైన టైటిల్  ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.