యాదగిరిగుట్టలో స్థానిక భక్తుల రాస్తారోకో

యాదగిరిగుట్టలో స్థానిక భక్తుల రాస్తారోకో
  • కొండపైకి వాహనాలను అనుమతించాలని డిమాండ్

యాదాద్రి: యాదగిరిగుట్ట పాతగుట్ట చౌరస్తాలో మెయిన్ రోడ్డుపై స్థానిక భక్తులు రాస్తారోకో చేశారు. యాదాద్రి ఆలయ ఈవో భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందంటూ నిరసనకు దిగారు. ద్విచక్ర వాహనాలతోపాటు భక్తుల అన్ని రకాల వాహనాలను కొండపైకి అనుమతించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించిన తర్వాత దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 
ముఖ్యంగా గత ఆరేళ్లుగా పునర్ నిర్మాణం కోసం దర్శనాలు నిలిచిపోయి న విషయం తెలిసిందే. అంతేకాదు రెండేళ్లుగా కరోనా కారణంగా అన్ని ఆలయాల్లో ఎలాంటి మొక్కుబడులు చెల్లించుకోవడానికి.. కనీసం దర్శించుకోవడానికి అవకాశం లేక ఇబ్బందిపడిన భక్తులు ప్రస్తుతం కరోనా ఆంక్షలన్నీ తొలగిపోవడంతో యాదాద్రి ఆలయానికి పోటెత్తుతున్నారు. ప్రస్తుతం పండుగల సందర్భంగా స్థానిక భక్తులు కుటుంబ సమేతంగా యాదాద్రి ఆలయంలో దర్శనాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే వాహనాలను అనుమతించకపోవడం దారుణమని వాపోయారు. అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

నిహారిక, రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు

కానిస్టేబుల్ పై దాడి చేసిన ఎద్దు

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ బాదుడు.. ఇవాళ ఎంతంటే