దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ బాదుడు.. ఇవాళ ఎంతంటే

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ బాదుడు.. ఇవాళ ఎంతంటే
  • మార్చి 22 నుంచి ధరలు పెంచడం ఇది 11వ సారి

దేశంలో మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. వరుసగా పెట్రోలు ధరల పెంపునకు శుక్రవారం బ్రేక్  ఇచ్చిన ఆయిల్  కంపెనీలు... మళ్లీ ధరలు పెంచేశాయి. దీంతో.. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఇది పదకొండోసారి. ఏప్రిల్ 1 న కమర్షియల్  సిలిండర్ పై ఒక్కసారే 250 రూపాయలు పెంచాయి చమురు సంస్థలు. 
ఇవాళ కొత్తగా లీటరు పెట్రోల్ పై 92 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 117 రూపాయల 25 పైసలకు చేరగా...డీజిల్ ధర 103 రూపాయల 32 పైసలకు పెరిగింది. విశాఖలో పెట్రోల్ 118 రూపాయల 40 పైసలు, డీజిల్ 104 రూపాయల 10 పైసలుగా ఉంది. మొత్తంగా 11 సార్లు ధరల పెరుగుదలతో లీటర్ పెట్రోల్, డీజిల్ పై సుమారు 9 రూపాయల వరకు ధరలు పెరిగాయి.
దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ పై 80 ల చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ 103 రూపాయల 41 పైసలు, డీజిల్ 94 రూపాయల 67 పైసలకు చేరింది.ముంబైలో పెట్రోల్ 118 రూపాయల 41 పైసలు, డీజిల్ 102 రూపాయల 64 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ 108 రూపాయల 96 పైసలు, డీజిల్ 99 రూపాయల 4 పైసలుగా.. కోల్ కతాలో పెట్రోల్ 113 రూపాయల 3 పైసలు, డీజిల్ 97 రూపాయల 82 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 108 రూపాయల 99 పైసలు... డీజిల్ 92 రూపాయల 83 పైసలుగా ఉంది.

 

ఇవి కూడా చదవండి

రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్

వాహనదారులపై ఆర్టీఏ ఫైన్ల మోత