వనపర్తి జిల్లాలో దారుణం: గురుకుల స్కూల్‎లో ఎలుకలు కొరికి విద్యార్థినులకు అస్వస్థత

వనపర్తి జిల్లాలో దారుణం: గురుకుల స్కూల్‎లో ఎలుకలు కొరికి విద్యార్థినులకు అస్వస్థత

గోపాల్ పేట, వెలుగు: వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలం బుద్ధారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఘటన బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ వ్యవహరించారు. సోమవారం బాధిత పదో తరగతి విద్యార్థినుల వెంట నర్సును పంపించి గోపాలపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. 

విద్యార్థినులకు పీహెచ్ సీ డాక్టర్ టీటీ ఇంజక్షన్లు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఘటన జరిగితే ఆలస్యంగా చికిత్స చేయించడంపై పేరెంట్స్ మండిపడ్డారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగా ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని పేరెంట్స్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.