చట్నీలో ఎలుకలు స్విమ్మింగ్ : JNTU ఇంజినీరింగ్ హాస్టల్ లో ఘోరం

చట్నీలో ఎలుకలు స్విమ్మింగ్ : JNTU ఇంజినీరింగ్ హాస్టల్ లో ఘోరం

ఇదివరకు హాస్టళ్లలో ఉండాలంటే పిల్లలు ఇబ్బంది పడేవారు. కానీ, ఇటీవల వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తోంటే హాస్టల్ అన్న ఆలోచన వస్తేనే భయపడేలా తయారయ్యింది పరిస్థితి. హాస్టల్ ఫుడ్ లో పురుగులు రావటం అది తిని పిల్లలు ఆసుపత్రి పాలవుతున్న ఘటనలు వరుసగా జరగటమే ఇందుకు కారణం. తాజాగా సుల్తాన్పూర్ లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్ లో చట్నీ సాంబార్ లో ఎలుకలు ప్రత్యక్షమవటం కలకలం రేపింది.

చట్నీతో ఎలుక ఈత కొడుతూ కనిపించటంతో స్టూడెంట్స్ అవాక్కయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వారం రోజుల క్రితమే ఫుడ్ క్రాంట్రాక్టర్ మార్చాలని ఆందోళనకు దిగారు విద్యార్థులు.కాంట్రాక్టర్ ను మారుస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చినప్పటికీ తీరు మారకపోవడంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. 

కాగా, ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని, చట్నీ పాత్రపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడిందని వివరణ ఇచ్చారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు.