బయటి వెంచర్ల కంటే సర్కార్ ప్లాట్ కు మస్తు రేటు

బయటి వెంచర్ల కంటే సర్కార్ ప్లాట్ కు మస్తు రేటు
  • బయటి వెంచర్ల కంటే రాజీవ్ స్వగృహలో డబుల్​
  • సర్కారు ధరలతో రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.లక్షల్లోనే
  • స్థలంతో సంబంధం లేకుండా అన్ని ప్లాట్లకు ఒకే విధమైన రేట్లు
  • కొనుగోలుకు ముందుకురాని సామాన్యులు.. కాల్​సెంటర్లకు ఫోన్లు చేసేవాళ్లు నిల్
  • ఓపెన్​ ఆక్షన్‌‌కు స్పందన అనుమానమే.. సిండికేట్‌‌గా ప్లాట్లు దక్కించుకునేందుకు రియల్టర్ల ప్లాన్​

నల్గొండ జిల్లా నార్కట్‌‌పల్లిలోని ఓ ప్రైవేట్ వెంచర్‌‌‌‌లో 200 గజాల ప్లాటు ధర గజానికి రూ.7 వేల చొప్పున రూ.14 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం గజం రూ.1,700 మాత్రమే. ఈ లెక్కన 200 గజాల ప్లాటు రేటు రూ.3.40 లక్షలు. దీనికి స్టాంప్ డ్యూటీ 7.5 శాతం చొప్పున రూ.25,500 కడితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అంటే రూ.14,25,500కు ప్లాట్ సొంతం అవుతుంది. అదే రాజీవ్​స్వగృహ కింద కొంటే గజం రూ.10 వేల చొప్పున 200 గజాల ప్లాటుకు రూ.20 లక్షలు, దీనిపై 7.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద లక్షన్నర. మొత్తంగా రూ.21,50,000 పెట్టాలి. అంటే 200 గజాల ప్లాటును ప్రైవేటులో కాకుండా సర్కారు వెంచర్‌‌‌‌లో కొంటే 
ఏకంగా రూ.7,25,000 నష్టపోవాల్సిన పరిస్థితి.

నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో సర్కారు వేలానికి పెట్టిన రాజీవ్​స్వగృహ ప్లాట్ల బేరం కుదిరేలా లేదు. ప్రభుత్వ ప్లాట్లు కదా, బయటికంటే రేటు తక్కువ ఉంటాయని ఆశించిన సామాన్యులు.. ఆఫీసర్లు ఖరారు చేసిన రేట్లను చూసి బిత్తరపోతున్నారు. ఆయా ఏరియాల్లో చదరపు గజానికి ప్రైవేట్ వెంచర్లతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ ధరలు ఉండడం, మార్కెట్ రేటుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఈనెల 11న 1,408 ఓపెన్ ప్లాట్లకు వేలం నోటిఫికేషన్ వెలువడగా, ప్రస్తుతం సైట్ విజిటింగ్ జరుగుతోంది. నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న రేట్లను చూసిన జనం.. ప్లాటు కొంటే అయ్యే రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో అటువైపు కూడా చూడడం లేదని ఆఫీసర్లే చెబుతున్నారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసే వాళ్లు కరువయ్యారని, ఒకవేళ చేసినా ఇవే డౌట్స్ అడుగుతుండడంతో ఏం చెప్పలేకపోతున్నామని అంటున్నారు. ఈ లెక్కన వచ్చే నెల 14 నుంచి జరిగే ఓపెన్​ ఆక్షన్‌‌కు స్పందన పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పది జిల్లాల్లో 1,408 ప్లాట్లు

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్​ కింద వివిధ దశల్లో ఉన్న అపార్ట్​మెంట్లు, జాగాలు కలిపి 1,575 ఎకరాలు ఉన్నట్లు సర్కారు లెక్కతేల్చింది. ఇప్పటికే కట్టిన, అసంపూర్తిగా ఉన్న ఇండ్లు, అపార్ట్‌‌మెంట్లను అమ్మి రూ.2,913 కోట్లు, ఖాళీ జాగాలను ప్లాట్లు చేసి అమ్మి రూ.2,412 కోట్లు, మొత్తంగా రూ.5,325 కోట్లు రాబట్టాలని టార్గెట్ ​పెట్టుకుంది.  రాజీవ్ స్వగృహ ప్లాట్లు అమ్ముతున్న లొకేషన్స్ హైవేలపై ఉండడంతో చుట్టుపక్కల ఇప్పటికే వందల ఎకరాల్లో ప్రైవేటు వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఆయా చోట్ల రియల్టర్లు గజం ఐదారు వేల చొప్పునే విక్రయిస్తున్నారు. అయితే సర్కారే వెంచర్లు చేయడంతో తక్కువ రేట్లు పెడ్తారని, తద్వారా పబ్లిక్ అటు అట్రాక్ట్ అయితే తమకు లాస్ వస్తుందేమోనని రియల్టర్లు భావించారు. తీరా చూస్తే సీన్​ రివర్స్ అయింది. ప్రైవేట్ వెంచర్ల కంటే ఎక్కువ రేట్లు పెట్టడంతో రియల్టర్లకు చాన్స్ వచ్చింది. ఇదే అదునుగా భావించిన రియల్టర్లు చాలాచోట్ల తమ ప్లాట్ల అమ్మకాలు నిలిపేశారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే స్వగృహ ప్లాట్లు అమ్ముడైతే తర్వాత తాము కూడా రేట్లు పెంచి అమ్ముకోవచ్చని వెయిట్ చేస్తున్నారు. నల్గొండ, మహబూబ్​నగర్, కామారెడ్డి లాంటి జిల్లాల్లో పబ్లిక్ ఎవరూ రాకుంటే తామే సిండికేట్‌‌గా మారి మొత్తం స్వగృహ ప్లాట్లు దక్కించుకునే ప్లాన్‌‌లో ఉన్నట్లు తెలిసింది. 

రాజీవ్ స్వగృహ ప్లాట్లు అమ్ముతున్న లొకేషన్స్ హైవేలపై ఉండడంతో చుట్టుపక్కల ఇప్పటికే వందల ఎకరాల్లో ప్రైవేటు వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఆయా చోట్ల రియల్టర్లు గజం ఐదారు వేల చొప్పునే విక్రయిస్తున్నారు. అయితే సర్కారే వెంచర్లు చేయడంతో తక్కువ రేట్లు పెడ్తారని, తద్వారా పబ్లిక్ అటు అట్రాక్ట్ అయితే తమకు లాస్ వస్తుందేమోనని రియల్టర్లు భావించారు. తీరా చూస్తే సీన్​ రివర్స్ అయింది. ప్రైవేట్ వెంచర్ల కంటే ఎక్కువ రేట్లు పెట్టడంతో రియల్టర్లకు చాన్స్ వచ్చింది. ఇదే అదునుగా భావించిన రియల్టర్లు చాలాచోట్ల తమ ప్లాట్ల అమ్మకాలు నిలిపేశారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే స్వగృహ ప్లాట్లు అమ్ముడైతే తర్వాత తాము కూడా రేట్లు పెంచి అమ్ముకోవచ్చని వెయిట్ చేస్తున్నారు. నల్గొండ, మహబూబ్​నగర్, కామారెడ్డి లాంటి జిల్లాల్లో పబ్లిక్ ఎవరూ రాకుంటే తామే సిండికేట్‌‌గా మారి మొత్తం స్వగృహ ప్లాట్లు దక్కించుకునే ప్లాన్‌‌లో ఉన్నట్లు తెలిసింది. 

సర్కారు ఆదేశాలతో ఆయా చోట్ల హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రైవేటుకు దీటుగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో వెంచర్లు డెవలప్​చేశారు. ఈ నెల 11న నోటిఫికేషన్ ఇచ్చారు. పది జిల్లాల్లోని 1,408 ప్లాట్లకు నాలుగు రకాల రేట్లను ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో చదరపు గజానికి రూ.40 వేలుగా నిర్ణయించిన ఆఫీసర్లు.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్, వికారాబాద్ జిల్లా యాలాల, నల్గొండ జిల్లా నార్కట్​పల్లి, కామారెడ్డిలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున, మహబూబ్​నగర్ జిల్లా భూత్పూర్, జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల, ఆదిలాబాద్‌‌‌‌లో రూ.8 వేల చొప్పున, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్‌‌‌‌‌‌‌‌లో చదరపు గజానికి రూ.5 వేల చొప్పున రేట్లు ఫిక్స్ చేశారు. వచ్చే నెల 14 నుంచి 17 వరకు జరగనున్న ప్రీ బిడ్ వేలంలో ఈ రేట్లకు మించి ప్లాట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది.

అన్ని ప్లాట్లకు ఒకే రేటు ఒకే గాటాన

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రాజీవ్ ​స్వగృహ వెంచర్లలోని ప్లాట్ల రేట్లు బయట ప్రైవేట్​వెంచర్లలో కంటే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌‌ను ఆనుకొని ఉండే అబ్దుల్లాపూర్​మెట్‌‌‌‌లోని ప్లాట్లకు, నల్గొండ జిల్లా నార్కట్‌‌పల్లి, కామారెడ్డిలోని ప్లాట్లకు ఒకే రేటు పెట్టడాన్ని బట్టి రేట్ల ఖరారులో శాస్త్రీయత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి కామారెడ్డిలో రాజీవ్​స్వగృహ చుట్టుపక్కల ప్రైవేట్ వెంచర్లలో గజం రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంది. నల్గొండ జిల్లా నార్కట్​పల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది. వికారాబాద్ జిల్లా యాలాలలో చదరపు గజానికి 3 వేలు మాత్రమే ఉంది. కానీ ఈ మూడు చోట్ల సర్కారు వెంచర్లకు రూ.10 వేలు పెట్టడంతో ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. అలాగే ప్రైవేట్ వెంచర్లలో మెయిన్ రోడ్డును ఆనుకొని ఉండే ప్లాట్లకు ఎక్కువ రేటు, వెనుక లైన్లలో ఉండే ప్లాట్లకు తక్కువ రేటు, ఈస్ట్, నార్త్ ఫేసింగ్​ప్లాట్ల కంటే సౌత్, వెస్ట్​ఫేసింగ్ ప్లాట్లకు తక్కువ రేట్లు ఉంటాయి. కానీ ఆఫీసర్లు మాత్రం సర్కారు వెంచర్లలోని ప్లాట్లన్నింటికీ ఒకే రేటు ఫిక్స్ చేశారు. కామారెడ్డిలో 230 ప్లాట్లు ఉండగా, అన్నింటికీ గజానికి రూ.10 వేలు ఖరారు చేశారు. దీంతో ఈ వెంచర్ దిక్కు చూసే వారే లేరు.

ఏ రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తరు?

రాజీవ్ స్వగృహ ప్లాట్లను ప్రభుత్వం మార్కెట్​వ్యాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్​ చేస్తుందా, లేదంటే నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్న రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తుందా అనే విషయంలో ఆఫీసర్లకే క్లారిటీ లేదు. ఒకవేళ నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్న రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం స్టాంప్​డ్యూటీ లక్షల్లో కట్టాల్సి వస్తుంది. అలాగని మార్కెట్​రేటుకే రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి ఉండదని, అది పూర్తిగా ఇల్లీగల్ అవుతుందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఆ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తే మున్ముందు లీగల్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రీబిడ్ వేలంలో ఏ రేట్​ఖాయమైతే ఆ రేటుకే ప్లాట్‌‌‌‌ను రిజిస్టర్ చేస్తామని జిల్లాల్లో కొందరు అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే ప్లాట్ కొనుగోలు చేసిన వాళ్లు నగదు మొత్తాన్ని వైట్​గా చూపించాల్సి ఉంటుంది. అంత మొత్తంలో వైట్​మనీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేట్లు తగ్గించాలి

కామారెడ్డిలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి సంబంధించి మినిమం రేటు గజానికి రూ.10 వేలు పెట్టడం ఎక్కువ. ధరలు తగ్గించాలి. అన్ని ప్లాట్లకు రేట్ ఒకేలా ఉంది. ముందు ఉండే ప్లాట్లకు ఒక రేట్, వెనుక ఉండే వాటికి ఇంకో రేటు ఉండాలి. వెంచర్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. అవన్నీ చేసి వేలం వేస్తే బాగుంటుంది.
- నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, కామారెడ్డి 

బిల్డర్లు సిండికేట్ అయితరు

గజానికి రూ.8 వేలు ధర నిర్ణయించినమని కలెక్టర్ చెబుతున్నరు. రోడ్డు పక్కనున్న ప్లాట్లకు ఈ ధర ఒకే. లోపల ఉన్న ప్లాట్లకు అంత రేట్ లేదు. కేవలం బిల్డర్లకు లాభం చేయడానికే ఈ ధర పెట్టిన్రు. సామాన్యులు రూ.8 వేలకు గజం అయితే కొనగలరు. బిడ్డింగ్‌‌‌‌లోకి బిల్డర్ ఎంటరైతే ఐదారుగురు కలిసి సిండికేట్ కావడం పక్కా. రూ.20 వేల వరకు వారు వేలం పాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బయట టాక్ ఉంది.
- రతంగ్‌‌‌‌ పాణి రెడ్డి, పాలమూరు