తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ నేషనల్ హైవే 44పై 378 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ సీఐ అజయ్ బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి మహారాష్ట్రలోని కొండల్ వాడికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నరనే సమాచారం మేరకు తూప్రాన్ లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ లారీలో రేషన్ బియ్యం పట్టుకున్నట్లు చెప్పారు.
అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని తూప్రాన్ పీఎస్కు తరలించామన్నారు. అక్కడ నుంచి పట్టుబడిన బియ్యాన్ని తూప్రాన్ లోని పౌర సరఫరాల గోదాంలలో భద్రపరిచమన్నారు. లారీ డ్రైవర్ వాసింఖాన్ నుఅరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వెంట సివిల్ సప్లై ఇన్స్పెక్టర్నర్సింలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
అమీన్ పూర్ : లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అమీన్ పూర్ పోలీసులు పట్టుకున్నారు. సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 34 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కాటేదాన్ ప్రాంతంలో సేకరించిన రేషన్ బియ్యాన్ని గుజరాత్ కు తరలిస్తున్నట్టుగా పోలీసు తెలిపారు.
పట్టుబడిన రేషన్ బియ్యం విలువ రూ.10 లక్షల పైనే ఉంటుందని అమీన్ పూర్ సీఐ నరేశ్చెప్పారు. బియ్యం పటాన్ చెరు గోదాంలో భద్రపరిచినట్లు వెల్లడించారు. సివిల్ సప్లై అధికారి శ్రీనివాస తేజశ్రీ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పంచ రాజు భాయ్ పై కేసు నమోదు చేశారు. వీరు గుజరాత్ కు చెందిన వారని సీఐ తెలిపారు.
