‘రావణాసుర’ చాలా డిఫరెంట్ మూవీ : దక్షా నగార్కర్

‘రావణాసుర’ చాలా డిఫరెంట్ మూవీ : దక్షా నగార్కర్

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్న  సందర్భంగా హీరోయిన్స్‌‌లో ఒకరైన దక్షా నగార్కర్  మాట్లాడుతూ ‘రవితేజ గారి మూవీలో పార్ట్ అవడం హ్యాపీ. నా పాత్ర గురించి సుధీర్ వర్మ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్‌‌గా అనిపించింది. కథ చెబితేనే సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. నాది పర్ఫార్మెన్స్‌‌కి స్కోపు  ఉండే క్యారెక్టర్.  నా మొదటి సినిమా ‘హోరాహోరి’ నుండి.. ‘జాంబిరెడ్డి’ వరకూ కొత్తగా, డిఫరెంట్‌‌గా ఉండే క్యారెక్టర్లే ట్రై చేశా. ‘రావణాసుర’ కూడా చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో నా పాత్ర చూసి సర్‌‌‌‌ప్రైజ్ అవుతారు. నాతో పాటు  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ కూడా నటించారు. నా పాత్రకు నేనెంత న్యాయం చేయగలనో అంతా చేశాను.  రవితేజ గారి వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయనతో నటించడం ఫీల్‌‌గుడ్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇచ్చింది. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు, అందరు హీరోలతో వర్క్ చేయాలని ఉంది. ప్రస్తుతం  రెండు సినిమాలకు కమిట్ అయ్యాను. వాటి వివరాలను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేస్తారు’ అని చెప్పింది.