Lokesh Kanagaraj: లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ పోస్ట్

Lokesh Kanagaraj: లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ పోస్ట్

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. ఆడియన్స్కు ఈ పేరు వింటే.. ఏదో మ్యాజిక్.. అదేదో తెలియని స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు..లోకేష్ తెరకెక్కించిన నగరం మూవీ నుంచి మొన్నటి లియో, కూలీ వరకు ఆడియన్స్లో ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. తీసింది కేవలం ఆరు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. దీంతో ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు అయితే మరో ఎత్తు. ఈ సినిమాలతో లోకేష్ అంటే ఇది అనేలా ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసేశాడు. ఈ క్రమంలొనే “లోకేష్ సినిమాటిక్ యూనివర్స్” వైపు ఫ్యాన్స్ లుక్ చేసేలా చేశాడు. 

ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్లో మరో స్టార్ హీరో వచ్చి చేరాడు. తనదైన సినిమాలతో.. సేవా కార్యక్రమాలతో పాన్ ఇండియా వైడ్గా అభిమానులను సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్తో బెంజ్ (BENZ) మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మరో తమిళ స్టార్ హీరో రవి మోహన్‌ (జయం రవి) జాయిన్‌ అయినట్టు డైరెక్టర్‌ లోకేశ్‌ ప్రకటించారు.

►ALSO READ | మా తాతయ్యే నా దేవుడు.. ‘శ్రీనివాస మంగాపురం’ ఈవెంట్‌లో జయకృష్ణ ఎమోషనల్!

ఈ సందర్భంగా ‘యూనివర్స్కి స్వాగతం రవి మోహన్ సార్’ అంటూ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. అయితే, లారెన్స్తో తలపడే విలన్? లేక మరో హీరోనా? అనేది సస్పెన్స్గా ఉంచారు లోకేష్. అయితే, ఇప్పటికే, మలయాళ హీరో నివిన్‌ పౌలీ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఈ క్రమంలోనే జయం రవి రోల్ ఏంటనేది ఆసక్తిగా మారింది.  

ఈ మోస్ట్ వయెలెన్స్ మూవీకి లోకేష్ కథను అందిస్తూ సుదన్ సుందరం, జగదీష్ పళనిసామితో కలిసి నిర్మిస్తున్నాడు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ రిలీజై అంచనాలు పెంచింది. "కారణంతో పోరాడే యోధుడు.. సైనికుడికంటే ఎక్కవు ప్రమాదకరం. వెల్కమ్ టు మై సినిమాటిక్ యూనివర్స్ లారెన్స్ మాస్టర్.." అంటూ లోకేష్ స్వాగతించారు. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో జయం రవి ప్రాజెక్ట్ లో ఎంటర్ అవ్వడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.

AA23 LCUలో భాగమేనా?

అల్లు అర్జున్ కెరీర్‌లో 23వ చిత్రంగా లోకేష్ సినిమా ఉండగా, ఇది AA23గా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే.. ఈ సినిమా లోకేష్ సృష్టించిన LCU (Lokesh Cinematic Universe) లో భాగమవుతుందా లేదా? అనేది. విక్రమ్, ఖైదీ, లియో చిత్రాల తరహాలోనే బన్నీ క్యారెక్టర్ కూడా ఆ యూనివర్స్‌లో ఉంటే మాత్రం, అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ అవుతుంది.

అయితే, దీనిపై చిత్ర యూనిట్ ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అరుణ్‌ మాథేశ్వరన్‌ డైరెక్షన్ లో ‘డీసీ’ అనే క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ట్రైలర్ రిలీజై దుమ్మురేపింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.