రోహిత్.. తొందరపడకు నీకే ప్రమాదం

రోహిత్.. తొందరపడకు నీకే ప్రమాదం

దుబాయ్‌‌‌‌‌‌‌‌: రీఎంట్రీ కోసం కంగారుపడితే రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ మళ్లీ గాయపడే ప్రమాదముందని టీమిండియా హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రవి శాస్త్రి అన్నాడు. బీసీసీఐకి అందిన మెడికల్‌‌‌‌‌‌‌‌ రిపోర్టు ప్రకారమే సెలెక్టర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌ను ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేయలేదని తెలిపాడు.   ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్​ అయిన రోహిత్‌‌‌‌‌‌‌‌ కు హ్యామ్‌‌‌‌‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌(మోకాలి కండరాల్లో) ఇంజ్యురీ అయ్యింది.  దీంతో పలు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు దూరమయ్యాడు.   రోహిత్​ ఇటీవల ప్రాక్టీస్​ స్టార్ట్​ చేసినప్పటికీ.. అతన్ని ఆసీస్​ టూర్​కు ఎంపిక చేయకపోవడంపై  రవిశాస్త్రి స్పందించాడు. ‘ ముంబై టీమ్‌‌‌‌‌‌‌‌ బీసీసీఐకి పంపిన మెడికల్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా రోహిత్ అంశంలో సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.  నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే, రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ముంబైకర్‌‌‌‌‌‌‌‌ మళ్లీ గాయపడే చాన్సుంది.  అందువల్ల రోహిత్​ తొందరపడకూడదు.  రోహిత్​తోపాటు ఇషాంత్​ కూడా అదే సిచ్యువేషన్​లో ఉన్నారు. వాళ్లు లేకపోవడం జట్టుకు చాలా లోటు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.